Thursday, May 21, 2020

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!



చిత్రం:పల్లెటూరు (1952), రచన:వేములపల్లి శ్రీకృష్ణ
సంగీతం:ఘంటసాల, గానం:ఘంటసాల, బృందం


పల్లవి:
చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!

చరణం:
వీర రక్తపుధార, వారవోసిన సీమ -2
పలనాడు నీదెరా, వెలనాడు నీదెరా ఆ.. -2
బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్
తాండ్ర పాపయ గూడ నీవోడోయ్

చరణం:
నాయకి నాగమ్మ, మల్లమాంబా, మొల్ల -2
మగువ మాంచాల నీతోడ బుట్టినవోళ్ళే -2
వీరవనితలగన్న తల్లేరా!
ధీరమాతల జన్మభూమేరా!                 

చరణం:
కల్లోల గౌతమీ....ఆ..ఆ..
వెల్లువల కృష్ణమ్మ..ఆ..ఆ..
కల్లోల గౌతమీ, వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రా తల్లి, పొంగి బారిన చాలు -2
ధాన్యరాశులె పండు దేశానా!
కూడు గుడ్డకు కొదువ లేదోయీ             

చరణం:
ముక్కోటి బలగమోయ్, ఒక్కటై మనముంటే..ఏ..
ఇరుగు పొరుగులోన, వూరు పేరుంటాది -2
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!
సవతి బిడ్డల పోరు మనకేలా!                 

చరణం:
పెనుగాలి వీచింది..ఆ..ఆ..
అణగారి పోయింది..ఆ..ఆ..
పెనుగాలి వీచింది – అణగారి పోయింది
నట్టనడి సంద్రాన – నావ నిలుచుండాది -2
చుక్కాని పట్టరా తెలుగోడా!..ఆ..
నావ దరిజేర్చరా – మొనగాడా!             

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!..ఆ.

  🍃🍃🌷🍃🍃 \// వెంకట్ నియోగి 🍃🍃🌷🍃🍃

మీకు తెలుసా???
మనం ఉంటున్న నగరం/పట్టణంలో ఎందరో మహానుభావుల పేర్లతో విద్యా సంస్థలు, కళా సాంస్కృతిక కేంద్రాలు, రహదారులు, కూడళ్లు ఉంటాయి.
కానీ, దురదృష్టవశాత్తు వాటి వాస్తవ నామం మరుగున పడిపోయి, సూక్ష్మ రూపంలోనో, అసలు పూర్తిగా మారిపోయి వేరే పేర్లతో పిలవడం అలవాటయింది.
తద్వారా భవిష్యత్తు తరాలకి వాటి యొక్క వాస్తవ నామం తెలుసుకునే అవకాశం లేకుండా పోతుంది.
విజయవాడ నగరానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు యిస్తున్నాను.
విజయవాడ నగరానికి చెందినది గానీ, మరేదైనా ఊరి గురించైనా మీకు తెలిసిన ఇటువంటి ఉదాహరణలు తెలియజేయండి. 🙏

🌷➡️ వాస్తవమైన పేరు.
👉 ➡ ప్రస్తుతం వాడుకలో ఉన్న పేరు.

విజయవాడ :
🌷 పండిట్ నెహ్రూ బస్ స్టేషన్
👉 కొత్త బస్టాండ్, PNBS

🌷 కాళేశ్వరరావు మార్కెట్
👉 కా.మార్కెట్, వన్ టౌన్ మార్కెట్

🌷 తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రం
👉 తుమ్మలపల్లి ఆడిటోరియం, కళా క్షేత్రం

🌷 ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల
👉 ఘంటసాల కాలేజి, మ్యూజిక్ కాలేజి

🌷 స్వరాజ్య మైదానం
👉 PWD Ground

🌷 జవహర్ ఆటోనగర్
👉 ఆటోనగర్, J.A.Nagar

🌷 మహాత్మా గాంధీ రోడ్
👉 బందరు రోడ్డు, M.G.ROAD
      ( పాత బస్టాండ్ నుండి బెంజ్ సర్కిల్ వరకు )

🌷 కార్ల్ మార్క్స్ రోడ్
👉 ఏలూరు రోడ్డు
      ( పాత బస్టాండ్ నుండి రామవరప్పాడు రింగ్ వరకు )

🌷 పింగళి వెంకయ్య మార్గ్
👉 పోలీస్ కమిషనర్ ఆఫీస్ రోడ్ (స్వరాజ్య మైదానం నుండి పోలీస్ కమిషనర్ కార్యాలయం మీదుగా గోపాలరెడ్డి రోడ్డు వరకు)

🌷 బాబు రాజేంద్ర ప్రసాద్ రోడ్
👉 BRP ROAD (వన్ టౌన్ వస్త్రలత నుండి పంజా సెంటర్ వరకు)

🌷 నాగేశ్వరరావు పంతులు రోడ్
👉 NRP ROAD (గాంధీ నగర్ తాలూకా సెంటర్ నుండి సత్యనారాయణపురం శివరావువీధి వరకు మెయిన్ రోడ్)

🌷 డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ వీధి
👉 సత్యనారాయణపురం లోని లలితామణి కళ్యాణ మండపం ఉన్న వీధి.

🌷 ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మున్సిపల్ కార్పొరేషన్ ప్రాధమికోన్నత పాఠశాల, సత్యనారాయణపురం.
👉 AKTP School

Tuesday, May 19, 2020

దీర్ఘాయుష్మాన్ భవ!

  🍃🍃🌷🍃🍃 \// వెంకట్ నియోగి 🍃🍃🌷🍃🍃 
తారక్!
మనలో చాలామందికి మనసులో "నేను మళ్లీ పుడితే ఎలా ఉంటానో చూసుకోవాలి" అనే కోరిక ఉంటుందట.
నువ్వు పుట్టి ఆ మహానుభావుడి కోరికను తీర్చావు. తన తర్వాత కూడా తన అంశ, నటన తెలుగు ప్రజల హృదయాలలో నీ రూపంలో చిరస్థాయిగా నిలిచి పోతుందని మనసా వాచా కర్మణా నమ్మాడు కనుకే ఆయన పేరే నిన్ను వరించింది. అదే నమ్మకంతో స్వర్గం నుండి నిరంతరం నిన్ను దీవిస్తూనే ఉన్నాడు.
కానీ, తారక్! ఒక్క విషయంలో నీ మీద నాకు అసంతృప్తి ఉంది. మహానటి సినిమాలో పెద్దాయన పాత్రలో కొంచెం సేపయినా నువ్వు కనబడితే సినిమాకి ఎంతో నిండుదనం వచ్చేది. మావంటి అభిమానులకు కనువిందు అయ్యేది. అంత మంచి సినిమాలో ఆ ఒక్క లోటు మాత్రం అలాగే మిగిలిపోయిన మాట వాస్తవం.
అయినా యిప్పటికి మాత్రం మించిపోయింది ఏముందిలే? బోల్డెంత వయసుంది, కావాల్సినంత దమ్ముంది. ఏకంగా మూడు పాత్రలలో ముచ్చటగా మురిపిస్తూ 'దాన వీర శూర కర్ణ' చేద్దువు గానిలే! పెద్దాయన ఆశీస్సులతో పాటుగా మా అందరి అభిమానం తోడుంటాయిగా.
ఏమిటోనయ్యా! ఇవాళ నీ పుట్టినరోజుని గుర్తు చేసుకుంటుంటే పదేపదే పెద్దాయనే గుర్తుకొస్తున్నాడు. ఎలాగూ ఇంకొన్ని రోజుల్లో (మే 28) ఆయన పుట్టినరోజు కూడా ఉందనుకో, కానీ ఎందుకో నిన్ను తలుచుకుంటే ఆయనే కళ్లల్లో మెదులుతున్నాడు.
జన్మదిన శుభాభినందనలు తారక్!
"శతమానం భవతి శతాయుః
పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి”
ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు!
అఖండ యశః ప్రాప్తిరస్తు!
ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు!
దీర్ఘాయుష్మాన్ భవ!!

Saturday, May 9, 2020

జగదేకవీరుడు అతిలోక సుందరి


" స్నేహంకి వీడ్కోలు చెప్పడం ఆలస్యమైతే
 అక్కడ స్వర్గ ద్వారాలు మూసుకుపోతాయి,
వెళ్ళు మిత్రమా! తిరిగి రాని నేస్తమా! "

సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇదే రోజున విడుదలై తెలుగు ప్రజలను స్వర్గ ద్వారపు అంచుల దాకా తీసుకెళ్ళిన చిత్రం....
'జగదేకవీరుడు అతిలోక సుందరి'.

మెగాస్టార్ కి అభినందనలు ❤
అతిలోక సుందరికి అశ్రు నివాళి 🙏

Wednesday, May 6, 2020

బుద్ధం శరణం గచ్ఛామి..

Image courtesy: Share Chat

సత్యం, అహింస, ప్రేమ, కరుణ
ఆత్మ చింతన, శాంతి స్థాపన
నీతి సూక్తులు, ధర్మ వచనాలు
జ్ణాన బోధలు, జన్మ సత్యాలు

సంఘ విధులను తెలిపిన యోగి
కర్మ బంధాలను దాటిన మౌన త్యాగి
సంఘం శరణం గచ్ఛామి..
బుద్ధం శరణం గచ్ఛామి..


\// వెంకట్ నియోగి ❤❤

Monday, May 4, 2020

శ్రీ ఆంజనేయం

Image courtesy : pinrest.com
మదిలో రాముని బంధించేసి
ఘనముగా కడలిని లంఘించేసి
రాముని క్షేమం ప్రేమగా తెలిపి
ధరణిజ మదిలో ధైర్యం నింపి

వానర సేనను సిద్దం చేసి
వారధి బంధన కావించేసి
సంజీవనితో ప్రాణం నిలిపి
కాగల కార్యము ఎదుటనే చూపి

రామ కార్యమును సఫలం చేసి
అయోధ్యాపురికి తోడ్కొని వచ్చి
సీతారాముల భక్తితో కొలిచి
మృత్యుంజయునిగా వరమును గెలిచి

venkatniyogi

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

చిత్రం:పల్లెటూరు (1952), రచన:వేములపల్లి శ్రీకృష్ణ సంగీతం:ఘంటసాల, గానం:ఘంటసాల, బృందం పల్లవి: చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీ...