🍃🍃🌷🍃🍃 \// వెంకట్ నియోగి 🍃🍃🌷🍃🍃
తారక్!
తారక్!
మనలో చాలామందికి మనసులో "నేను మళ్లీ పుడితే ఎలా ఉంటానో చూసుకోవాలి" అనే కోరిక ఉంటుందట.
నువ్వు పుట్టి ఆ మహానుభావుడి కోరికను తీర్చావు. తన తర్వాత కూడా తన అంశ, నటన తెలుగు ప్రజల హృదయాలలో నీ రూపంలో చిరస్థాయిగా నిలిచి పోతుందని మనసా వాచా కర్మణా నమ్మాడు కనుకే ఆయన పేరే నిన్ను వరించింది. అదే నమ్మకంతో స్వర్గం నుండి నిరంతరం నిన్ను దీవిస్తూనే ఉన్నాడు.
కానీ, తారక్! ఒక్క విషయంలో నీ మీద నాకు అసంతృప్తి ఉంది. మహానటి సినిమాలో పెద్దాయన పాత్రలో కొంచెం సేపయినా నువ్వు కనబడితే సినిమాకి ఎంతో నిండుదనం వచ్చేది. మావంటి అభిమానులకు కనువిందు అయ్యేది. అంత మంచి సినిమాలో ఆ ఒక్క లోటు మాత్రం అలాగే మిగిలిపోయిన మాట వాస్తవం.
అయినా యిప్పటికి మాత్రం మించిపోయింది ఏముందిలే? బోల్డెంత వయసుంది, కావాల్సినంత దమ్ముంది. ఏకంగా మూడు పాత్రలలో ముచ్చటగా మురిపిస్తూ 'దాన వీర శూర కర్ణ' చేద్దువు గానిలే! పెద్దాయన ఆశీస్సులతో పాటుగా మా అందరి అభిమానం తోడుంటాయిగా.
ఏమిటోనయ్యా! ఇవాళ నీ పుట్టినరోజుని గుర్తు చేసుకుంటుంటే పదేపదే పెద్దాయనే గుర్తుకొస్తున్నాడు. ఎలాగూ ఇంకొన్ని రోజుల్లో (మే 28) ఆయన పుట్టినరోజు కూడా ఉందనుకో, కానీ ఎందుకో నిన్ను తలుచుకుంటే ఆయనే కళ్లల్లో మెదులుతున్నాడు.
జన్మదిన శుభాభినందనలు తారక్!
"శతమానం భవతి శతాయుః
పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి”
ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు!
అఖండ యశః ప్రాప్తిరస్తు!
ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు!
దీర్ఘాయుష్మాన్ భవ!!
No comments:
Post a Comment