Monday, April 20, 2020

నీవే రా శివా

నీకై రాతలు
నీకై మొక్కులు
నీకై జ్యోతలు
నీ కైమోడ్పులు
నీవే రా శివా

తలచిన ఉదయం
కొలచిన సమయం
పిలిచిన హృదయం
పలికెడి దైవం
నీవే రా శివా

భస్మం దేహం
గరళం కంఠం
శూలం హస్తం
మోక్షం త్రినేత్రం
నీవే రా శివా

శిగపై గంగ
సగమై అంబ
కాలుడి అంశ
జీవుల అండ
నీవే రా శివా

నిర్గుణ రూపం
నిర్మల హృదయం
నిశ్చల వదనం
నిగూఢ అర్థం
నీవే రా శివా

మౌనవిధి
ధ్యానస్థితి
జ్ణాననిధి
మోక్షగతి
నీవే రా శివా

నిర్మోహం
నిరంహంకారం
నిర్వికల్పం
నిరాకారం
నీవే రా శివా
✍ venkatniyogi

No comments:

Post a Comment

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

చిత్రం:పల్లెటూరు (1952), రచన:వేములపల్లి శ్రీకృష్ణ సంగీతం:ఘంటసాల, గానం:ఘంటసాల, బృందం పల్లవి: చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీ...