Tuesday, April 14, 2020

యోచన

ఏం రాయమంటడవు సామీ కొత్తగా!!
ఏం మార్సినాదని ఆయమ్మి బతుకు?
పొద్దు కాడ్నుండి యోచన చేస్తండ కొత్తగా రాయనింకి, మార్సుడు ఏందా అని?
దినామంత శనక్కట్టె పీకితే ముట్టేడిది అరవై రూపాయలు,
ఎల్లిగారం కలిపిన సంగడి ముద్ద గొంతు కడ్డమవుతాంటే కండ్ల నీళ్లు తిరగాడతన్న ఆ బిడ్డలని చూసి...
ఏం రాయమంటడవు సామీ కొత్తగా!!
పందెం కోడి లెక్క పాలెగాడింటికి పొయ్యిన యింటోడు బువ్వ కొస్తడో, పందెంలోనే పోతడోనని గుమ్మవొంక దిగాలుగా చూస్తున్న ఆయమ్మిని చూసి...
ఏం రాయమంటడవు సామీ కొత్తగా!!

రాసుడు కాదు సామీ! మార్సుడు కావాల!
ఆళ్ల బతుకులల్ల యెలుగు రావాల!!

పాలెగాళ్లకి తెలికుండా రావాల
ఆల్ల పక్కలో బల్లెమల్లె రావాల
అట్టాంటి నాయకుడు రావాల

అప్పుడు రాస్తా సామీ కొత్తగా
పొద్దు తెల్లార్నింక ఆయమ్మి మొహంలో
కనబడుతాన్న నవ్వుని చూసి
అప్పుడు రాస్తా సామీ కొత్తగా

ఆ దినాం కొరకే యోచన
ఆ దినామొస్తదా అని యోచన
- Venkat Niyogi

No comments:

Post a Comment

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

చిత్రం:పల్లెటూరు (1952), రచన:వేములపల్లి శ్రీకృష్ణ సంగీతం:ఘంటసాల, గానం:ఘంటసాల, బృందం పల్లవి: చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీ...