
నిత్యానందం దేహి
బాల గోపాల కృష్ణ పాహి పాహి
కలభా సుందర గమన కస్తూరి శోభితానన
నళిన దళ యత నాయన నంద నందన
మిళిత గోపా వధూజన మీనాంక కోటి మోహన
దళిత సంసార బంధన దారుణ వైరి నాశన ||నీల||
వ్యత్యస్త పాదారవింద విశ్వ వందిత ముకుంద
సత్య ఖండ బోధానంద సద్గుణ బృంద
ప్రత్యస్తమిత భేద కంద పాలిత నంద సునంద
నిత్యదా నారాయణ తీర్థ నిర్మలానంద గోవిందా ||నీల||
✍ సద్గురు నారాయణ తీర్థులు
No comments:
Post a Comment