Tuesday, April 21, 2020

నా పలుకుల జాజిమల్లి


పల్లవి :
మధురం.... సుమధురం.... నీ అధరుల తీయదనం
తిమిరం.... ఆవలి తీరం....  నీ కన్నుల రవి కిరణం
నిర్మలం.... ఆకాశం.... నీ మోమున పచ్చదనం
మనసే.... ఉల్లాసం.... నీ నునుసిగ్గుల దరహాసం

అనుపల్లవి :
నా పలుకుల జాజిమల్లి నీ సిగలో జాబిల్లి
పారిజాత పాలవెల్లి నా పాటల రాగమల్లి  
                                                  || నా పలుకుల ||

చరణం - 1 :
తొలిప్రేమలో నీవల్లే నా శ్వాసలో నిట్టూర్పులు
తొలి వేకువ కిరణాలే పారాణిగా పాదాలు
ఆ అడుగుల సవ్వడులే నా పాటకు ఊపిరులు
ఆ మువ్వల పల్లవులే అలల హొయల చరణాలు
                                                        || మధురం ||
చరణం - 2 :
తొలి చినుకుల దొంతరలే పెనవేసిన పరవశాలు
సెలయేటి గాలి కెరటాలే నీలి ముంగురుల సోయగాలు
చిలిపి కనులె భాష్యంగా జత కలిసిన అధరాలు
కౌగిళ్ళకు సాక్ష్యంగా పై యెదపై సంతకాలు
                                                        || మధురం ||
✍ venkatniyogi

No comments:

Post a Comment

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

చిత్రం:పల్లెటూరు (1952), రచన:వేములపల్లి శ్రీకృష్ణ సంగీతం:ఘంటసాల, గానం:ఘంటసాల, బృందం పల్లవి: చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీ...