గుడి కట్టిన స్నేహం నేనొదలక
ముడి పెట్టిన బంధం నన్నొదలక
కొడి గట్టిన ప్రాణం కనుదాటక
పగ బట్టిన పాశం వెంటాడగ
నేనొల్లను రా శివా!
నా తూరుపు తెల్లారనిదే
నేనొరగను రా శివా!
నేనొదగను రా శివా!!
✍ @venkatniyogi
శిగన చంద్ర మకుటం పొంగు గంగ కెరటం
నీలి గరళ కంఠం హిమ నగరిలో పీఠం
గిరి తనయతో మనువు సగం పంచిన తనువు
వల్లకాటిన నెలవు ఉసురు తీయుటె కొలువు
త్రిశూల ధారిణం త్రినేత్ర వీక్షణం
త్రిమూర్తి రూపిణం త్రిలోక పూజితం
నామ శంకరుడు రూప సుందరుడు
కాల తిమిహరుడు లోక భవహరుడు
హరహర శంభో పదముప్పొంగ
శివ నామంబది హోరెత్తంగా
ప్రదోష కాలపు పూజలనందగ
వేగమె రారా ద్వాదశ లింగా
✍ venkatniyogi
ముడి పెట్టిన బంధం నన్నొదలక
కొడి గట్టిన ప్రాణం కనుదాటక
పగ బట్టిన పాశం వెంటాడగ
నేనొల్లను రా శివా!
నా తూరుపు తెల్లారనిదే
నేనొరగను రా శివా!
నేనొదగను రా శివా!!
✍ @venkatniyogi
శిగన చంద్ర మకుటం పొంగు గంగ కెరటం
నీలి గరళ కంఠం హిమ నగరిలో పీఠం
గిరి తనయతో మనువు సగం పంచిన తనువు
వల్లకాటిన నెలవు ఉసురు తీయుటె కొలువు
త్రిశూల ధారిణం త్రినేత్ర వీక్షణం
త్రిమూర్తి రూపిణం త్రిలోక పూజితం
నామ శంకరుడు రూప సుందరుడు
కాల తిమిహరుడు లోక భవహరుడు
హరహర శంభో పదముప్పొంగ
శివ నామంబది హోరెత్తంగా
ప్రదోష కాలపు పూజలనందగ
వేగమె రారా ద్వాదశ లింగా
✍ venkatniyogi
No comments:
Post a Comment