ప్రకృతి రమణీయ సోయగాల చీర కట్టిన భూదేవమ్మ
పంటచేల సిరులు చూసి పులకించె పల్లె మాయమ్మ
ఏటేటా సంబరాన మ్రొక్కులంది దీవించెడి పోలేరమ్మ
విరబూసిన అందంతో పచ్చదనాల తల్లి మాగాణమ్మ
కమ్మని మట్టి వాసనలకు మురిసి కదిలిన కూలన్న
జోడెడ్లను కట్టి ఏరువాకకు సాగిన శ్రామిక రైతన్న
వరుణదేవునికి మ్రొక్కి అరక దున్ని జల్లగ విత్తులు
పుడమి తల్లి గర్భం నుండి మొలకలెత్తి పలకరించె
ఎండ వానలకోర్చి ఆలుబడ్డల వలె సాకి
కోత కొచ్చిన పచ్చని పైరు చెంతకు జేరి
ఆనంద బాష్పాల నడుమ స్వాగతించి
ధాన్య సిరులను చూడ మురిసిన కష్టజీవులు
✍ venkatniyogi
No comments:
Post a Comment