ఇల్లు కదలొద్దంటే ఆలుబిడ్డ లేమిగాను?
ఆకలాకలంటుంటే కూటికేడికి పోను?
మీ సర్కారి సాయాలు ఎండమావులుగా దొరా;
మాయదారి రోగమంట మా బతుకులల్ల మన్నుబోసె!
మస్తుగా పైసలున్నోడు కదలకుండనే ఉంటాడు;
కూలి పైనే బతికేటోడు కదలక ఎట్లుంటాడు?
పొట్ట చేత పట్టొస్తిమి వలస మనుషులం దొరా;
మాయదారి రోగమంట మా బతుకులల్ల మన్నుబోసె!
✍ venkatniyogi
No comments:
Post a Comment