
కంస మామని వధించి
పాండు సుతులను గాచి
గీత నుతులను పంచి
దివి జనుల రక్షించి
గోవర్ధన గిరిధారి
సమ్మోహన మురారి
అష్ట సతులఁ గూడి
సరసమాడిన మౌళి
పదియారు వేల సఖుల
నుద్దరించిన మురళి
గోవర్ధన గిరిధారి
సమ్మోహన మురారి
దుష్ట శిక్షణ కోరి
పాండు నందను జేరి
సారధిగ మారి
నడిపె సమర భేరి
గోవర్ధన గిరిధారి
సమ్మోహన మురారి
సుందర శిఖిపింఛ మౌళి
వేణుగాన మధు మురళి
శ్రీ రాధా హృదయ రవళి
సరస శృంగార రాచకేళి
గోవర్ధన గిరిధారి
సమ్మోహన మురారి
✍ venkatniyogi
No comments:
Post a Comment