Friday, April 24, 2020

ఒక పిలుపులో పిలిచితే....


రచన : ఏడిద కామేశ్వరరావు
గానం : కుమారి శ్రీరంగం గోపాలరత్నం
ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట 
నా పలుకులో కులుకుతావట ఓ..ఓ...ఓ..
ఆపదమొక్కులస్వామీ నీ సన్నిధె నా పెన్నిధి||
కొండంత దేవుడవని కొండంత ఆశతో 
నీ కొండచేరవచ్చితిని అండచేర్చి కాపాడరా||
అభయహస్తమున్నదట అభయమూర్తినీవెయట అభయదానమిచ్చి నాకు భవతరణపధమ్ము చూపు||
వడ్డికాసువాడవట వడ్డీవడ్డీ గుంజుదువట అసలులేనివారమయ్య వెతలుబాపికావవయ్య||

No comments:

Post a Comment

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

చిత్రం:పల్లెటూరు (1952), రచన:వేములపల్లి శ్రీకృష్ణ సంగీతం:ఘంటసాల, గానం:ఘంటసాల, బృందం పల్లవి: చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీ...