Tuesday, April 21, 2020

యాదికొస్తుండావు


పొద్దున్నే సలిదన్నం ముద్ద జేసి పెట్టినావు
బడికి నే పోతావుంటే కన్నార్పక చూసినావు
నేనేసిన అడుగుల్లో తప్పొప్పులు నేర్పినావు
అమ్మా! ఈ పొద్దు నువు యాదికొస్తుండావు

"అయ్యా!" అని నోరారా గారంగా పిలిచినావు
సెప్పకుండ ఎళ్ళిపోయి మా గుండెల పిండినావు
మా బిడ్డల్లే మళ్ళొచ్చీ మా ఆశలన్ని నిలిపినావు
అమ్మా! ఈ పొద్దు నువు యాదికొస్తుండావు
✍ venkatniyogi

No comments:

Post a Comment

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

చిత్రం:పల్లెటూరు (1952), రచన:వేములపల్లి శ్రీకృష్ణ సంగీతం:ఘంటసాల, గానం:ఘంటసాల, బృందం పల్లవి: చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీ...