చెట్టు మీద కోయిలమ్మ పాడుతున్న పల్లె పాట
గట్టు మీద పరువాలు వయ్యారంగా సయ్యాట
సిగ్గు మొగ్గలు విచ్చుకున్న కొంటె నవ్వుల పూదోట
మాపటేళ మంచె మీద ఒక్కటయిన వెన్నెలాట
గడ్డివాము చాటుమాటు ఆడుకున్న ఊసులాట
లేత పెదవి నందుకున్న కోడె వయసు ఉరుకులాట
చెక్కిలిపై ఎరుపెక్కిన మందారం దోబూచులాట
పైట కొంగు పాన్పు పైన పరుచుకున్న వలపు తోట
✍ venkatniyogi
No comments:
Post a Comment