"కాశిరెడ్డీ! గుళ్ళో అయ్యోరి బిడ్డని కాన్పుకి పట్నం తోలుకు పోవాల్నంట, బండి కట్టుకుపో! అట్నే అమ్మనడిగి మూడేలు దుడ్డు ఎత్తకపోయి అయ్యోరి సేతికియ్యి, అక్కరకు తోడుంటాది."
"ఏంది నాయనా! మనాధి పట్టినట్టు అట్లుండావ్? సెల్లి మతి కొస్తుండాదా? రెండు దినాల్ల వస్తుల్లా?"
"లగ్గం యోచన ఇప్పుడేంది నాయనా? ఆయమ్మి సదువు మళ్ళేటిదాంక ఉంటాదని సెప్పుండ్లే? ఆయమ్మి వచ్చినంక ఓపాలి మాట్లాడదాంలే"
"రేయ్ సూరీడు! సిన్నమ్మిని తీసుకురానీకి స్టేషన్ పోవాలా, బండి దియిరా!"
"సెల్లీ! ఎట్లుండావమ్మా? ప్రయాణం ఎట్లయినాది?"
"నాయనేకేంది? బావుల్లా! నీ లగ్గం యోచన తప్ప ఆయన మతి దేన్తాన లేకపోయె"
"సెప్పినాలే! పై ఏటికి సేద్దామని, ఆ దేశంల నీ సదువు బాగయితాందా?"
"రేయ్! బండ్ల సామాను సిన్నమ్మి గదిలో పెట్టు"
"నాయనా! నీ బిడ్డ వచ్చినాది, నీ యోచనేందే ఆయమ్మికి సెప్పుకో, నడిమింట నా తలకాయ తినాకు"
"ఏందమ్మా! బిడ్డొచ్చినాదని సానానే సేసినావే?"
"రేయ్ సూరీడు! సిన్నమ్మొచ్చినాది, ఈ పొద్దు అందరూ ఈడ్నే సెయ్యి కడగాల"
"నాయనా! ఏంది నువ్వు సెప్పేటిది? నీ తోడబుట్టిన దాని ఇంటితో ఇయ్యమందాలా? దినాం కొట్లాటతో సంపుకునే ఊర్లొకి మనింటి బిడ్డనంపుతావా? మతి మంచిగుండక్కర్లా?"
"సెల్లీ! నాయన యోచన సరిలేకుండే, నువ్వెట్లా సరంటండావు? పెద్ద దేశంలా డాక్టరుగిరి సదుకోని ఆయింటికి పోనీకి ఎట్టా మనసైతాంది, ఎవరైనా బలం పెట్టినారా ఏంది? ఇంకోతూరి యోచన సెయ్యమ్మా"
"రామ్మా! కూచో.... నాయన, సెల్లి యోచనింటివా? ఎట్టా నాయం? నువ్వైనా సెప్పబన్లే?"
"ఏందీ! మనువు సెల్లికి కాదా? ఆ యింటి బిడ్డని నేను మనువాడాల్నా? ఇంట్లా మనువీడుకొచ్చిన బిడ్డ తిరగతాంటే నా మనువు యోచనేంది? పెద్దోళ్ల మతికేమయితాంది? ఊర్ల తలెత్తి తిరిగేటిదుందా?"
"బాగుండావా పెద్దయ్యా! ఊర్ల అంతా బాగేనా? మా నాయన తొందర జూసినావా? సెల్లి మనువుకు మునుపే నా మనువుకు లగ్గం రాయిస్తుండే, నాకేం మతయితలేదు పెద్దయ్యా"
"అయ్యో! ఈ పొద్దు యినరాని మాటలు నా సెవులకు తాకుతాన్నయి, ఏంది పెద్దయ్యా! నువ్వు సెప్పేటిదీ? సెల్లికి కాన్సరా? ఎక్కువ దినాలు బతికేటిది లేదా? దేవుడా! ఏం తక్కువ సేసినామయ్యా నీతాన, సెప్పలేని కష్టమిచ్చినావు మాయింట్ల"
"సిన్నమ్మా! ఎంత కష్టమయినాది తల్లీ! ఇందుకేనా నా మనువుకు తొందరజేసినావు, నువ్వు సదివిన సదువన్నా నీ ఊపిరికి అక్కర పడకపోయినే?
"నాయనా! ఇంతకాలం మీ యందరికీ తెలిసినా ఒక్కరైనా నాతోని సెప్పకపోతిరే? లేదు నాయనా! సెల్లిని పెద్దాసుపత్రికి తీస్కపోదాం, సెల్లి బతకాలా, నా సెల్లికేంగాదు."
"అట్లనే సెల్లీ! నీ సివరి కోరిక తీర్చనింకైనా నే మనువు చేస్కుంటా, ఊరకుండమ్మా! నువ్వు మళ్ళీ పుట్టుడేంది? నా బిడ్డకు నీ పేరు పెట్టుడేంది? నీకేం కాదు, నేనుంటిగా సెల్లి."
( సంవత్సరం తర్వాత....)
"అమ్మీ! సిన్నమ్మని ఎత్తుకోని ఎదురొచ్చి పో, ఈ పొద్దు చేలో శనకట్టె పీకిించనీకి పోతండా"
✍ venkatniyogi

అన్న...ఏమన్నవ్రాసినవా...చింపినవ్ తీ..అంత ఏకపాత్రాభినయం..
ReplyDeleteథాంక్యూ 🙏
ReplyDelete